‘ఉపాధి’ సక్రమంగా నిర్వహించాలి
ABN , Publish Date - May 09 , 2025 | 12:03 AM
ఉపాధి హామీపఽథకం పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. గురువారం మండలం లోని ముంజేరు సమీ పంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవోలు,ఈసీలు, టీఏలతో సమావేశం నిర్వహిం చారు.
భోగాపురం, మే 8(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీపఽథకం పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. గురువారం మండలం లోని ముంజేరు సమీ పంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవోలు,ఈసీలు, టీఏలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గతనెలలో నిర్వహించిన పనుల గురించి అడిగి తెలుసుకొన్నారు. నీటి వనరులను భద్రప రచడం,నీటితొట్టెలు పునరుద్దరించడం ద్వారా నీటి నిల్వ లు పెంచుకోవచ్చని సూచించారు.సముద్రతీరంలో తాటి మొక్కలునాటడంతో పర్యావరణం కాపాడడం తోపాటు ఇసుక కొట్టుకుపోకుండా ఉంటుందని తెలిపారు.