ఉపాధి పథకం బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - May 22 , 2025 | 12:11 AM
తక్షణమే ఉపాధి వేతన బిల్లులు చెలించాలని వేతనదారులు కోరారు.ఈ మేరకు బుధవారం రామభద్రపురంలో చొక్కాపువాని చెరువు వద్ద ఆరువారాలుగా వేతనాలు చెల్లించడంలేదని వేతనదారులు నిరసన తెలిపారు.
రామభద్రపురం, మే 21(ఆంధ్రజ్యోతి): తక్షణమే ఉపాధి వేతన బిల్లులు చెలించాలని వేతనదారులు కోరారు.ఈ మేరకు బుధవారం రామభద్రపురంలో చొక్కాపువాని చెరువు వద్ద ఆరువారాలుగా వేతనాలు చెల్లించడంలేదని వేతనదారులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు బలసా శ్రీను మాట్లాడుతూ వేతన దారులకు ఆరు వారాల నుంచి బిల్లులు అంద కపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే తక్కువ వేతనం ఇస్తున్న కేంద్రప్రభుత్వం బిల్లుల చెల్లింపులో కూడా ఆలస్యం చేయడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎండతీ వ్రత ఎక్కువగా ఉండడంతో రెండు పూటలా పనులు చేయడంతో వేతన దారులు ఇబ్బందులు పడుతున్నారని, ఒక్కపూటే పనులు చేయించాలని కోరారు.కొంతకాలంగా ఉపాధి పనులు చేస్తున్నవారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని, ఎండలో పనులు చేయడం వల్ల చాలా మంది అనారో గ్యానికి గురవుతున్నారని తెలిపారు. పని ప్రదేశంలో టెం ట్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఉపాధిహామీ కూలీకి రూ.307ల కనీస వేతనం ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు జాబ్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.