Share News

ఐటీఐతో ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:09 AM

ఐటీఐ శిక్షణతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందవొచ్చని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. శనివారం స్థానిక ఐటీఐ కేంద్రంలోగల అన్ని ట్రేడుల ల్యాబ్‌లను పరిశీలిం చారు. ఐటీఐలో శిక్షణ పూర్తయిన తరువాత దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం.గోపాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

 ఐటీఐతో ఉపాధి అవకాశాలు
ఐటీఐ విద్యార్థులతో మాట్లాడుతున్న పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌:

సీతంపేట రూరల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఐటీఐ శిక్షణతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందవొచ్చని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. శనివారం స్థానిక ఐటీఐ కేంద్రంలోగల అన్ని ట్రేడుల ల్యాబ్‌లను పరిశీలిం చారు. ఐటీఐలో శిక్షణ పూర్తయిన తరువాత దూరప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం.గోపాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ కోరారు. శనివారం స్థానిక బాలుర గురుకుల పాఠశాల, జూనియర్‌ బాలుర కళాశాలను సందర్శించారు. పాఠశాలలో భోజనం వంటకాల రుచిని పరిశీలించారు. గిరిజన విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టే భోజనం రుచికరంగా ఉండాలని పాఠ శాల సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Oct 26 , 2025 | 12:09 AM