Share News

ఉపాధి అవకాశాలు కల్పించాలి

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:08 AM

:కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు శిక్షణకార్యక్రమాలు నిర్వహించి, ప్రతిభవంతు లైన నిరుద్యోగులకు రుణాలు అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ కోరారు.

ఉపాధి అవకాశాలు కల్పించాలి
మాట్లాడుతున్న మురళీమోహన్‌ :

రాజాం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు శిక్షణకార్యక్రమాలు నిర్వహించి, ప్రతిభవంతు లైన నిరుద్యోగులకు రుణాలు అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ కోరారు. గురువారం రాజాంలోని నైరాడ్‌ శిక్షణ కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో బ్యాంకర్లు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నైరాడ్‌లో ఉచిత కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి బ్యాం కుల్లో రుణాలు మంజూరు వారికి స్వయం ఉపాధి అవకా శం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజరు రమణమూర్తి , నాబార్డు ఏజీఎం పి.నాగార్జున, నైరెడ్‌ డైరెక్టర్‌ రాజేష్‌, ఏపీఎస్‌డీసీ జిల్లా నైపు ణ్యాధికారి ప్రశాంత్‌కుమార్‌, ఎంప్లాయిమెంట్‌ అధికారి వహీర్‌, పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, మహస్త్రష్‌, సమతం శ్రీను, వల్లూరు గణేష్‌ పాల్గొన్నారు.

ప్రకృతి సాగును ప్రోత్సహిస్తాం

ప్రకృతి వ్యవసాయం పండించిన రైతులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. గురువారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం రైతు జాతీయరైతునేస్తం అవార్డు గ్రహీత పెంకి గౌరీశ్వరరావు పండిం చిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన మైసూరుమల్లిక, దేశవాళీ బ్రౌన్‌ రైసును ఎమ్మెల్యేకు అందజేశారు.కార్యక్రమంలో గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, టంకాల నాగరాజు, పెంకి చైతన్యకుమార్‌ పాల్గొన్నారు

Updated Date - Nov 07 , 2025 | 12:08 AM