ఎస్సీ యువత నైపుణ్యానికి తగ్గట్టు ఉపాధి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:24 AM
రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు ముఖ్యంగా మాలల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని మాలల సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయకుమార్ తెలిపారు.
ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తాం
మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్
విజయనగరం కలెక్టరేట్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు ముఖ్యంగా మాలల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని మాలల సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయకుమార్ తెలిపారు. ఎస్సీ యువత నైపుణ్యానికి తగ్గట్టు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గురువారం ఎస్సీ కార్పొ రేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న ఉపాధి కల్పన పథకాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి వాటిని ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా రూపకల్పన చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల ఆర్థికాభివృద్ధికి ఈ ఏడాది రూ.340 కోట్ల బడ్జెట్ కేటాయించిదని, ఈ నిధులతో స్వయం ఉపాధి పథకాలను రూపొందిస్తామని తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక ఎస్సీ యువతి, యువకుడును ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా రూపొందించడ మే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు అవసరమైన నైపు ణ్య శిక్షణ, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణను ఎస్సీ యువతకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టరు కార్యాలయం స మీపంలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, దీన్ని బాగు చేయించే చర్యలు చేపడతామని చెప్పారు. ముందుగా కలెక్టరు అంబేడ్కర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వివిధ పథకాలపై చర్చించారు. సమా వేశంలో ఎస్సీ మాల కార్పొరేషన్ డైరక్టరు మరిడయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.