ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:05 AM
ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్న తులు కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి భాసూరు కృష్ణమూర్తి కోరారు
పాలకొండ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్న తులు కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి భాసూరు కృష్ణమూర్తి కోరారు.ఈమేరకు బుధవారం విజయనగరంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డికి ఈయూ నాయకులు కె.శ్రీనివాసరావు, మూర్తి, నారాయణ, పద్మ, ప్రసాద్, తౌడయ్య, లత, రవికాంత్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు.