Share News

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:12 AM

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎం.రత్నం హెచ్చరించారు.

ఉద్యోగులు సమయపాలన పాటించాలి
రామభద్రపురం: కొట్టక్కి సచివాలయంలో రికార్డులు తనిఖీచేస్తున్న ఎంపీడీవో రత్నం

రామభద్రపురం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎం.రత్నం హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కొట్టక్కి సచివాలయా న్ని తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కా రానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రీవెన్స్‌ ఎప్పటికపుం్పడు పూర్తిచే యాలని ఆదేశించారు.పంచాయతీలో పారిశుధ్యం, మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ బలోపేతం చేసే విధంగా ఆదాయమార్గాలు పెంచుకోవడంపై దృష్టిసారించాలన్నారు. ఇళ్ల పన్నుల వసూళ్ల లక్ష్యాలు పూర్తిచేయాలని తెలిపారు. అనంతరం సచివాలయ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆకుల ప్రవీణ్‌కు మార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జన్నివలసలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కూలీల హాజరు శాతం అడిగి తెలుసుకున్నారు.

ఫబొబ్బిలి రూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అన్ని సర్వేలు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్‌ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కోమటిపల్లి గ్రామసచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది సమయ పాలనపై ఆరాతీశారు. ఏయే సమస్యలు ఎక్కువగా సచివాలయానికి వస్తున్నా యోనని అడిగితెలుసుకున్నారు. ఏవైనాసమస్యలు వస్తే మండల స్థాయి అధికారు లతో చర్చించాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సచివాలయంలో అందాల్సిన సేవలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అందించాలని ఆదేశించారు. అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సచివాలయా న్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

Updated Date - Dec 27 , 2025 | 12:12 AM