Share News

పోక్సో కేసులో ఉద్యోగి అరెస్టు

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:56 PM

గోపాలరాయుడుపేటకు చెంది న రెవెన్యూ శాఖ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదు చేసి బుధవారం రాత్రి అరెస్టు చేశామని డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు.

 పోక్సో కేసులో ఉద్యోగి అరెస్టు

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): గోపాలరాయుడుపేటకు చెంది న రెవెన్యూ శాఖ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదు చేసి బుధవారం రాత్రి అరెస్టు చేశామని డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు. ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడం తో పాటు లైంగికంగా వేధించినందుకు ఆయనపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. అయితే నిందితుడి పేరు డీఎస్పీ వెల్లడించలేదు.

Updated Date - Sep 18 , 2025 | 11:56 PM