Share News

elephants: కదలని ఏనుగులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:37 PM

elephants: జియ్యమ్మవలస మండలం నుంచి ఏనుగులు కదలడం లేదు. 15 రోజులుగా ఇక్కడే తిష్ఠవేసి ఉన్నాయి.

 elephants: కదలని ఏనుగులు
బాసంగి- పాత నిమ్మలపాడు మధ్య ఉన్న ఏనుగులు

- 15 రోజులుగా జియ్యమ్మవలస మండలంలోనే తిష్ఠ

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం నుంచి ఏనుగులు కదలడం లేదు. 15 రోజులుగా ఇక్కడే తిష్ఠవేసి ఉన్నాయి. గున్న ఏనుగు జన్మించిన తరువాత నాగావళి నది దాటి కొమరాడ మండలంలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. గురువారం సాయంత్రం వరకు బాసంగి- పాత నిమ్మలపాడు గ్రామాల మధ్య నాగావళి నదిలో సేదతీరుతూ కనిపించాయి. గజరాజులు మునుపటి వలే ప్రశాంతంగా లేవని, గున్న ఏనుగు కారణంగా కొంచెం అప్రమత్తతో ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కురుపాం ఫారెస్ట్‌ రేంజర్‌ గంగరాజు కోరారు. తమ అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్లు ఏనుగుల నుంచి ప్రజలను కాపాడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఏనుగుల తరలింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:37 PM