ఏనుగులను జూకు తరలించాలి
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:04 AM
ఏనుగుల గుంపును వచ్చిన చోటుకి లేదా జూకు తరలించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి వేణు కోరారు.
సీతానగరం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి):ఏనుగుల గుంపును వచ్చిన చోటుకి లేదా జూకు తరలించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి వేణు కోరారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ రెండురోజులుగా ఏను గుల గుంపు సంచరిస్తోందని,రెండేళ్ల కిందటకూడా మండలంలో ఏనుగుల గుంపు ప్రవే శించి పంటలను నాశనం చేసిందని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ నష్ట పరిహారంచెల్లించలేదని చెప్పారు. మూడు నెలల కిందట అప్పయ్యపేట వద్ద ఏను గుల జోన్ ఏర్పాటుచేసి ఏనుగులను సంరక్షిస్తామని అటవీశాఖ అధికారులు పనులు ప్రారంభిస్తే తమ పార్టీ అడుకుందని తెలిపారు.అటవీశాఖ అధికారులు గిరిజన, దళిత రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా వారి భూములకు పట్టాలిప్పిస్తామని, మూడు ఎకరాల్లో కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటి ద్వారా మచ్చిక చేయించి ఏనుగుల సంరక్షణతో పాటు ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడికి తరలిస్తామని మాట ఇచ్చారని గుర్తుచేశారు. నేటికీ కుంకి ఏనుగులు రాలేదని, ఇప్పుడు ఒడిశా నుంచి తప్పిపోయిన ఏనుగులను అప్పయ్యపేట తరలిస్తున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి, పంట నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, మండల నాయకులు గవర వెంకటరమణ, పార్టీ సభ్యులు చందనపల్లి కృష్ణ, వై.రామారావులు పాల్గొన్నారు.