Elephants ఏనుగుల హల్‌చల్
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:06 AM
Elephants on the Rampage కొమరాడ మండలంలో గత రెండు రోజులుగా గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలిపోతున్నారు. ప్రధానంగా కుమ్మరిగుంట-కందివలస గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగులు అరటి, వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి.
కొమరాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో గత రెండు రోజులుగా గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలిపోతున్నారు. ప్రధానంగా కుమ్మరిగుంట-కందివలస గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగులు అరటి, వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి. ప్రస్తుతం అవి కోనవలస కొండపైకి చేరుకున్నాయి. దీంతో గ్రామ స్థులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గజరాజుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్షణమే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో రైతులు పంట పొలాలకు వెళ్లరాదని, గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.