Elephants వన్నాంలో ఏనుగులు
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:49 PM
Elephants in Vannam : కొమరాడ మండలంలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు నిమ్మలపాడు, బిత్రపాడు గ్రామాల్లో సంచరించిన గజరాజులు ఆదివారం వన్నాం పంచాయతీ పరిధిలో దర్శనమిచ్చాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు.
కొమరాడ, జూలై 20(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు నిమ్మలపాడు, బిత్రపాడు గ్రామాల్లో సంచరించిన గజరాజులు ఆదివారం వన్నాం పంచాయతీ పరిధిలో దర్శనమిచ్చాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోయారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని భయాందోళన చెందారు. కాగా తొమ్మిది గజరాజులు అరటి, పామాయిల్ పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీశాఖాధి కారులు స్పందించి తక్షణమే వాటిని తరలించే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.