Share News

నేరడిలో ఏనుగులు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:12 AM

భామిని మండలాన్ని ఏనుగుల గుంపు వదలడం లేదు.

   నేరడిలో ఏనుగులు
జీడి తోటల నుంచి బయటకు వస్తున్న ఏనుగులు

భామిని, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): భామిని మండలాన్ని ఏనుగుల గుంపు వదలడం లేదు. గత నెల రోజులుగా పసుకుడి, సింగిడి, బిల్లుమడలో సంచరిస్తూ మొక్కజొన్న, వరి పంటలతో పాటు నీటి ఇంజన్లను ధ్వంసం చేశాయి. శుక్రవారం ఉదయం నేరడి బ్యారేజీకి చేరుకున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎక్కడుంటాయో తెలియక పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఎండకు తాళలేక ఏనుగులు పగలంతా జీడితోటల్లోనే ఉంటున్నాయని, సాయంత్రం చల్లబడితే బయట సంచరిస్తున్నాయని బీట్‌ ఆఫీసర్‌ దాలినాయుడు తెలిపారు. ఎండకు తాళలేక, నీరు అందక చిరాకుగా ఉంటున్నాయని అంటున్నారు. ఏనుగుల సంచారంపై కేర్‌ ట్రాకర్స్‌ రైతులకు, ప్రజలకు సమాచారం అందిసున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:12 AM