Share News

Elephants in sunki సుంకిలో గజరాజులు

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:15 PM

Elephants in sunki గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో మంగళవారం గజరాజులు హల్‌చల్‌ చేశాయి. పొలాల్లో సంచరించి స్థానికులను బెంబేలెత్తించాయి. మొక్కజొన్న, అపరాలు, అరటి పంటలను నాశనం చేస్తున్నాయి.

Elephants in sunki సుంకిలో గజరాజులు
సుంకి పంట పొలాల్లో సంచరిస్తున్న గజరాజుల గుంపు

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో మంగళవారం గజరాజులు హల్‌చల్‌ చేశాయి. పొలాల్లో సంచరించి స్థానికులను బెంబేలెత్తించాయి. మొక్కజొన్న, అపరాలు, అరటి పంటలను నాశనం చేస్తున్నాయి. కాగా గత రెండు రోజుల పాటు నందివానివలస, గిజబ పరిసర ప్రాంతాల్లో సంచరించిన ఏనుగులు తిరిగి సుంకికి చేరుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని కోరుతున్నారు. మరోవైపు అటవీశాఖాధికారులు, ట్రాకర్లు ప్రజలను అప్రమత్తం చేశారు. పంట పొలాల వైపు వెళ్లరాదని రైతులకు సూచించారు.

Updated Date - Apr 29 , 2025 | 11:15 PM