Share News

Elephants కోటిపాంలో గజరాజులు

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:00 PM

Elephants in Kotipam కొమరాడ మండలం కోటిపాం గ్రామ సమీపంలో ఏనుగులు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అవి ఏ క్షణాన గ్రామంలోకి వస్తాయోనని భయాందోళన చెందుతున్నారు.

Elephants   కోటిపాంలో గజరాజులు
పొలాల్లో సంచరిస్తున్న ఏనుగు

కొమరాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం కోటిపాం గ్రామ సమీపంలో ఏనుగులు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అవి ఏ క్షణాన గ్రామంలోకి వస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. మరోవైపు గజరాజులు చెరకు, పత్తి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా ఇదే మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీశాఖ సిబ్బంది ఏనుగులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:00 PM