బిల్లుమడ తోటల్లో ఏనుగుల తిష్ఠ
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:57 PM
బిల్లుమడ గ్రామ సమీప తోటల్లో ఏనుగులు తిష్ఠ వేశాయి. దీంతో అటవీశాఖాఽధికారులు అప్రమత్తమయ్యారు.

- అప్రమత్తమైన అటవీశాఖాఽధికారులు
భామిని, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): బిల్లుమడ గ్రామ సమీప తోటల్లో ఏనుగులు తిష్ఠ వేశాయి. దీంతో అటవీశాఖాఽధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం పాలకొండ ఫారెస్ట్ రేంజర్ కె.రామారావు కేర్ ట్రాకర్స్‌తో కలిసి బిల్లుమడ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వంశధార నదికి వెళ్లే రహదారిలోని బిల్లుమడ తోటల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని, ప్రజలు అటువైపు వెళ్లవద్దని సూచించారు. ఏనుగులు తమకు నచ్చినట్టు వ్యవహరిస్తాయన్నారు. వాటి నడవడికలను గమనించి ప్రజలు, రైతులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఏనుగులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అటవీశాఖ సబ్ డివిజనల్ అధికారి సంజీవెళ్ల అధికారులకు సూచించారు. సోమవారం రాత్రి సింగిడి వద్ద జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఏనుగులు ఉన్నాయని, వాటి వద్దకు వెళితే దాడికి పాల్పడతాయని అన్నారు. ఏనుగులకు ఫొటోలు తీయవద్దని, మనుషులను చూస్తే చిరాకు పడతాయని పేర్కొన్నారు. పూజారి శంకర్ ఏనుగుల దాడి నుంచి బయటపడడం అదృష్టమన్నారు. బిల్లుమడ, నేరడి, సింగిడి, పసుకుడి, లివిరి తదితర గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.