Elephant చింతలబెలగాంలో ఏనుగుల బీభత్సం
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:40 PM
Elephant Rampage in Chintalabelagam మండలంలోని చింతలబెలగాం పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం వేకువజామున సుర్ల కురిమినాయుడు అనే రైతుకు చెందిన 30 బస్తాల ధాన్యాన్ని, దుక్కి యంత్రాన్ని ధ్వంసం చేశాయి. సుర్ల శంకర్ అనే మరో రైతుకు చెందిన రెండు బస్తాల ధాన్యాన్ని నాశనం చేశాయి.
జియ్యమ్మవలస, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలబెలగాం పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం వేకువజామున సుర్ల కురిమినాయుడు అనే రైతుకు చెందిన 30 బస్తాల ధాన్యాన్ని, దుక్కి యంత్రాన్ని ధ్వంసం చేశాయి. సుర్ల శంకర్ అనే మరో రైతుకు చెందిన రెండు బస్తాల ధాన్యాన్ని నాశనం చేశాయి. దీంతో లబోదిబోమన్న రైతులు వెంటనే ఆ గ్రామంలో ఉంటున్న వట్టిగెడ్డ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మూడడ్ల సత్యంనాయుడు ద్వారా వీఆర్‌వో వినాయకుడికి సమాచారం అందించారు. ఈ విషయాన్ని తహసీల్దార్, అటవీశాఖ అధికారులకు తెలియజేసి నివేదిక అందజేస్తానని వీఆర్‌వో బాధిత రైతులతో అన్నారు. ప్రస్తుతం ఏనుగులు చింతలబెలగాం ,దత్తివలస గ్రామాల మధ్య తిష్ట వేసి ఉన్నాయి. పొలాల్లో, కళ్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలను, వరి చేలను ఏం చేస్తాయోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.