Share News

పంపు సెట్లకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలి

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:09 AM

వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని అలజంగిరైతులు కోరారు.ఈమేరకు మంగళవారం తహసీ ల్దార్‌ ఎం.శ్రీనుకు రైతుసంఘం నాయకుడు బి.వెంకటరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

పంపు సెట్లకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న అలజంగి రైతులు:

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని అలజంగిరైతులు కోరారు.ఈమేరకు మంగళవారం తహసీ ల్దార్‌ ఎం.శ్రీనుకు రైతుసంఘం నాయకుడు బి.వెంకటరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ గ్రామంలో 200 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని, ఇటీవల ఇద్దరు వ్యక్తుల మధ్య కుటుంబ కలహాల వల్ల వాల్టా చట్టం ప్రకారం ఫిర్యాదుచేయగా విద్యుత్‌సిబ్బంది వ్యవసాయ విద్యుత్‌సరఫరా నిలిపి వేశారని తెలిపారు. దీంతో మిగతా రైతులు విద్యుత్‌ సదుపాయం లేక వ్యవసాయానికి పంపు సెట్ల ద్వారా నీరు పొలాలకు అందించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:09 AM