Share News

విద్యుత్‌ ఏడీఈ నిర్బంధం

ABN , Publish Date - May 22 , 2025 | 12:17 AM

సాలూరు పట్టణంలోని అల్లువీధి రామమందిరంలో బుధవారం విద్యుత్‌ ఏడీఈ రంగారావును స్థానికులు నిర్బం ధించారు.

 విద్యుత్‌ ఏడీఈ నిర్బంధం
రామమందిరంలో విద్యుత్‌ ఏడీఈని నిర్బంధించిన దృశ్యం

- మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరా ఉండడం లేదని

సాలూరు పట్టణ ప్రజల నిరసన

- గంటే కదా నిలిచిపోయిందన్న ఏడీఈ

- స్థానికుల ఆగ్రహం

- ఆయన్ను రామమందిరంలో నిర్బంధించిన వైనం

సాలూరు, మే 21(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలోని అల్లువీధి రామమందిరంలో బుధవారం విద్యుత్‌ ఏడీఈ రంగారావును స్థానికులు నిర్బం ధించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అల్లువీధి, అక్కేన వీధి, నాయుడువీధి, దుగ్గాణ వీధికి గత మూడు రోజులుగా విద్యుత్‌ సేవలు నిలిచి పోయాయి. దీంతో స్థానికులు బుధవారం సాయంత్రం 6 గంటలకు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌ ఏడీఈ రంగారావు సాయంత్రం 6.30 గంటలకు అల్లువీధి రామమందిరం వద్దకు చేరుకున్నా రు. దీంతో స్థానికులు మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని, అసలు విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీనికి గాను ఏడీఈ కేవలం గంటే కదా విద్యుత్‌ సేవలు నిలిచిపోయాయని సమాధానం చెప్పారు. దీంతో స్థానికులు ఆగ్రహించి ఆయన్ను వెంటనే రామమందిరంలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ అప్పలనాయుడు, రూరల్‌ సీఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. నాలుగు వీధులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపైకి వచ్చి కొవ్వొత్తులతో ధర్నా నిర్వహించారు. విద్యుత్‌ అధికారుల తీరుపై తీవ్ర పదజాలాలతో విరుచుకుపడ్డారు. రాత్రి 9 గంటలకు విద్యుత్‌ ఏడీఈని విడిచిపెట్టారు.

21SLRP16.gif

కొవ్వొత్తులతో ఆందోళన చేస్తున్న స్థానికులు

Updated Date - May 22 , 2025 | 12:17 AM