పాము కాటుతో వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:25 AM
గరివిడి పట్టణంలో బీసీ కాలనీకి చెందిన వరదా సత్యవతి(60) అనే మహిళ పాము కాటుకు గురై మృతిచెందింది.
గరివిడి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గరివిడి పట్టణంలో బీసీ కాలనీకి చెందిన వరదా సత్యవతి(60) అనే మహిళ పాము కాటుకు గురై మృతిచెందింది. ఆదివారం రాత్రి ఇంటిలో మంచంపై పడుకున్న సత్యవతి తెల్లవారి లేచేసరికి అపస్మారక స్థితిలో ఉండడాన్ని కుటుంబీకులు గమనించారు. ఆమెను విజయ నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి ఈమె పాము కాటుకు గురైందని, అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. గరివిడి ఎస్‌ఐ లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.