Share News

కాలువలో పడి వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:08 AM

మండలంలోని పెద్దబొండపల్లి సమీపంలో జంఝావతి కాలువ దాటుతుండగా అందులో పడిపోయి చుక్క కాంతమ్మ(70) శనివారం ప్రమాదశవాత్తూ మృతి చెందింది.

కాలువలో పడి వృద్ధురాలి మృతి

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దబొండపల్లి సమీపంలో జంఝావతి కాలువ దాటుతుండగా అందులో పడిపోయి చుక్క కాంతమ్మ(70) శనివారం ప్రమాదశవాత్తూ మృతి చెందింది. పెద్దబొండపల్లికి చెందిన కాంతమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 21 , 2025 | 12:08 AM