Share News

వ్యాను ఢీకొని వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:07 AM

సారిపల్లి గ్రామంలో వ్యాను ఢీకొని అదే గ్రామానికి చెందిన మజ్జి అన్నపూర్ణ(65) మృతిచెందారు.

వ్యాను ఢీకొని వృద్ధురాలి మృతి

నెల్లిమర్ల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సారిపల్లి గ్రామంలో వ్యాను ఢీకొని అదే గ్రామానికి చెందిన మజ్జి అన్నపూర్ణ(65) మృతిచెందారు. ఎస్‌ఐ బి.గణేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సారిపల్లి గ్రామంలో తన అల్లుడు సారిపల్లి గురునాయుడు దుకాణం వద్ద అన్నపూర్ణ కూర్చుని ఉన్న సమయంలో కుదిపి వైపు నుంచి వస్తున్న వ్యాను ఆమెను బలంగా ఢీకొంది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యింది. వెంటనే ఆమెను చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాను డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 12:07 AM