కారు ఢీకొని వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:18 AM
బూసాయవలస జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది.
రామభద్రపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బూసాయవలస జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కు సంబంధించి ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండకెంగువ గ్రామానికి చెందిన రాజుమహేంద్ర అప్పలమ్మ (65) మెంటాడ నుంచి మామిడివలస గ్రామానికి వెళుతుండగా బూసాయవలస జంక్షన్‌లో కారు ఢీకొందన్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఎన్‌ఆ ర్‌ఐ ఆసుపత్రిలో చేర్చారన్నారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిందని తెలిపారు. మృతురాలి మనవడు ఆర్.ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.