Share News

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:26 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నెల్లిమర్ల బైరెడ్డి వీధికి చెందిన గిడుతూరి అప్పలనారాయణ(70) సోమవారం వేకువజామున మృతిచెందారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

నెల్లిమర్ల, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నెల్లిమర్ల బైరెడ్డి వీధికి చెందిన గిడుతూరి అప్పలనారాయణ(70) సోమవారం వేకువజామున మృతిచెందారు. అప్పల నారాయణ ఈనెల 19న సాయంత్రం నెల్లిమర్లలో రోడ్డు దాటుతుండగా గుర్ల మండలానికి చెందిన ఒక వ్యక్తి మోటార్‌ సైకిల్‌తో ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో గాయపడిన అప్పలనారాయణను కుటుంబీకులు తొలుత విజయనగరం ఆసుపత్రికి, అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:26 AM