Man Dies పిడుగుపాటుకు వృద్ధుడి మృతి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:46 PM
Elderly Man Dies After Lightning Strike భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన పాలపర్తి సిమ్మన్న (62) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.
భామిని, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన పాలపర్తి సిమ్మన్న (62) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పరికరాలు, కత్తు, కొడవళ్లు, గొడ్డళ్లు సానపడుతూ సిమ్మన్న జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఆ పని మీద కొత్తగూడ వెళ్లాడు. అయితే స్వగ్రామానికి తిరిగొస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. కొత్తగూడ-మాసగూడ మధ్య పిడుగుపడింది. దీంతో అక్కడిక్కడే వృద్ధుడు మరణించాడు. వంశధార వరదకాలువ పక్కన అచేతనంగా పడి ఉన్నట్టు తెలుసుకున్న కుమారులు రమేష్, సురేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు.