ట్రాక్టర్ కింద పడి వృద్ధుడి మృతి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:59 PM
ఇసుక ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు.
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఇసుక ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన ఎస్.కోటలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉన్న వన్‌వే ట్రాఫిక్ వద్ద కొటాన వల్లయ్య(75) అనే వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తుండగా.. ధర్మవరం నుంచి ఎస్.కోట వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈక్రమంలో ఆయన వెనుక టైరు కింద పడిపోయారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసును నమోదు చేసినట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు.