నేలబావిలో పడి వృద్ధుడి మృతి
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:03 AM
పట్టణంలోని తెలగవీధి శ్మశానం సమీపంలోని నేలబావిలో పడి గొల్లవీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ (69) మృతి చెం దినట్టు ఏఎస్‌ఐ రమణ తెలిపారు.
రాజాం రూరల్, జూన్16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తెలగవీధి శ్మశానం సమీపంలోని నేలబావిలో పడి గొల్లవీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ (69) మృతి చెం దినట్టు ఏఎస్‌ఐ రమణ తెలిపారు. ఏఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మణ మతిస్థిమితం లేకపోవడంతో తరచూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి వస్తుం టాడు. ఎప్పటి మాదిరిగానే లక్ష్మణ ఈనెల 15న మధ్యాహ్నం ఇంటి నుం చి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు తెలగవీధిలోని నేలబావిలో పడి మృతి చెందినట్టు కుటుంబసభ్యులు గుర్తించారు. మృతుడి భార్య నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ తెలిపారు.