గూడ్స్ ఢీకొని వృద్ధుడి మృతి
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:47 PM
గూడ్స్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
దత్తిరాజేరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): గూడ్స్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఎర్‌పీఎఫ్ హెడ్ కాని స్టేబుల్ బి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాచిపెంటకు చెందిన దాసరి తవిటయ్య(70) మండలంలోని మరడాం గ్రామ సమీ పంలో రైలు పట్టాలు దాటుతుండగా డౌన్‌లైను నుంచి వస్తున్న గూడ్స్ ఢీకొంది. దీంతో ఆయనకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలిం చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.