బావిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:05 AM
మండలంలోని విక్రంపురం గ్రామా నికి చెందిన తూతిక సోమేశ్వరరావు(60) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా రు.
కొమరాడ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విక్రంపురం గ్రామా నికి చెందిన తూతిక సోమేశ్వరరావు(60) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా రు. ఏడాదిన్నరగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పార్వ తీపురం జిల్లా ఆసుపత్రిలో ఆయన ప్రతివారం డయాలసిస్ చేయించుకుంటు న్నారు. తాజాగా నడుం నొప్పి అధికం కావడంతో జీవితంపై విరక్తితో ఆదివారం గ్రామ శివారులోని దివాన్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి భార్య పార్వతీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.