Share News

గడ్డిమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:16 AM

మండలంలోని తుమరాడ గ్రామా నికి చెందిన రాకోటి అప్పలస్వామి(65) సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

గడ్డిమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

పాలకొండ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమరాడ గ్రామా నికి చెందిన రాకోటి అప్పలస్వామి(65) సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అప్పల స్వామిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యం లోనే అప్పలస్వామి మృతి చెందాడు. పోలీసులు అప్పలస్వామి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 12:16 AM