egg Rs.8 కోడిగుడ్డు రూ.8
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:40 PM
egg Rs.8 కోడి గుడ్డు ధర రికార్డు సృష్టిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాంసాహారంగా భావించే గుడ్డు ధర రోజురోజుకూ పైకి ఎగబాకుతోంది.
కోడిగుడ్డు రూ.8
గత కొన్నేళ్లతో పోల్చితే రికార్డు ధర
పౌల్ర్డీ నిర్వాహకులకు ఉపశమనం
సామాన్యులకు ఇబ్బందికరం
రాజాం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):
కోడి గుడ్డు ధర రికార్డు సృష్టిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాంసాహారంగా భావించే గుడ్డు ధర రోజురోజుకూ పైకి ఎగబాకుతోంది. హోల్‌సేల్‌గా రూ.6.70కు విక్రయిస్తుండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.7.50 నుంచి రూ.8 వరకూ విక్రయిస్తున్నారు. మొన్నటి వరకూ వ్యాధులు, వాతావరణ మార్పులు, మేతల ధరలతో పౌల్ర్డీ పరిశ్రమ డీలా పడింది ప్రస్తుత ధర కొంత ఉపశమనం ఇస్తోంది. అయితే సామాన్యులకు, కొనుగోలుదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మున్ముందు ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రోజుకు 12 లక్షల గుడ్లు వినియోగిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవలస ప్రాంతంలో కోళ్ల పరిశ్రమలు అధికం. స్థానికంగా గుడ్లు అందుబాటులో ఉన్నా హోల్‌సేల్ వ్యాపారులే వీటి ధరను నిర్ణయిస్తారు. సాధారణంగా శీతాకాలంలో గుడ్ల ధరలు పెరుగుదల అనేది సహజం. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ధరల ప్రకారం 2021 ఇదే నెలలో సగటు ధర రూ.4.39 ఉండగా.. 2022లో రూ.5.16... 2023లో రూ.5.27.. 2024లో రూ.5.66గా ఉంది. ఈ ఏడాది పౌల్ర్డీ పరిశ్రమల వద్ద రూ.6.09గా ఉండగా బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.8 పలుకుతుండడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
--------------