Egg Prices Soar కొండెక్కిన గుడ్డు ధర
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:09 PM
Egg Prices Soar జిల్లాలో గుడ్లు ధరలు కొండెక్కాయి. రోజురోజుకూ ఆకాశన్నంటుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవంగా రెండు నెలల కిందట గుడ్డు ధర రూ.5 నుంచి రూ.5.50 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.7.50కు చేరింది.
బెంబేలెత్తిపోతున్న ప్రజలు
పాలకొండ, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గుడ్లు ధరలు కొండెక్కాయి. రోజురోజుకూ ఆకాశన్నంటుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవంగా రెండు నెలల కిందట గుడ్డు ధర రూ.5 నుంచి రూ.5.50 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.7.50కు చేరింది. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేటషన్ కమిటీ నిరయించిన రేట్ల ప్రకారం జిల్లాలో హోల్‌సేల్‌లో వంద గుడ్లు ధర రూ.665గా ఉంది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు ధర రూ.7.50కు పలుకుతుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8కు విక్రయిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి తగ్గడంతోనే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసుకున్నా కిలో రూ.60 నుంచి రూ.80 పైనే పలుకుతుంది. గుడ్డు ధర కూడా అమాంతం పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.