Share News

మాతాశిశు ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:04 AM

మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్య ఆరోగ్యశాఖ అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకుడు కేవీఎస్‌ అనీల్‌కుమార్‌ అన్నారు.

మాతాశిశు ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి
మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఏడీ అనీల్‌కుమార్‌

పార్వతీపురం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్య ఆరోగ్యశాఖ అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకుడు కేవీఎస్‌ అనీల్‌కుమార్‌ అన్నారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణకు విచ్చేసిన ఆయన గురువారం స్థానిక ఎన్జీవో హోంలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించి న సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై సమీక్ష జరిపారు. గర్భిణుల వైద్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంగా జననీ మిత్ర యాప్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. మాతా శిశు మరణాలు నివారించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. స్టేట్‌ కన్సల్టెంట్స్‌ నరేంద్ర, వెంకటేష్‌లు యాప్‌పై వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇందుకు పైలెట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో ఐదు పీహెచ్‌సీలను ఎంపిక చేసినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఐవో నారాయణరావు, ప్రోగ్రాం అధికారి వినోద్‌, పీహెచ్‌సీ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:04 AM