Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - May 24 , 2025 | 12:18 AM

ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

  • బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి రూరల్‌, మే 23 (ఆంధ్రజ్యో తి): ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. శుక్రవారం బొబ్బిలి కోటలో గల తన క్యాంపు కార్యాల యంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. పట్టణం, పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పంచాయతీరాజ్‌ శాఖ డీఈతో నియోజకవర్గ పనులపై సమీక్షించి, పలు సూచనలు చేశా రు. అలాగే టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు ఎమ్మెల్యేని కలిసి పలు వార్డులకు సంబంధించిన సమస్యలను వివరించారు.

సీహెచ్‌సీ మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం

బొబ్బిలి సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న పాత భవనాన్ని పరిశీలించి, మరమ్మతులు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సూపరెంటెండెంట్‌ శశిభూషణరావు, వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు, ఆహారం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెడ్స్‌ తక్కువ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరగా, ఆ దిశగా చరలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - May 24 , 2025 | 12:18 AM