ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:15 AM
ప్రజా సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.
ప్రభుత్వ విప్ జగదీశ్వరి
గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె ప్రజల నుంచి వినతు లను స్వీకరించారు. గృహ నిర్మాణం, చెక్‌డ్యాంలు, రెవెన్యూ సమస్యలు ఇలా పలు సమస్యలపై మొత్తం 35 వినతులు అందించారు. వీటిని పరి శీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కన్వీనర్ కడ్ర క మల్లేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, కురపాం నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి పాల్గొన్నారు.