సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:55 PM
: ప్రజావేదికలో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలపై వినతులు అందించారు. కాగా పార్వతీపురానికి చెందిన మాచర్ల గణపతిరావుకు రూ.63,105 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే విజయచంద్ర తన కార్యాలయంలో అందించారు.
పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజావేదికలో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలపై వినతులు అందించారు. కాగా పార్వతీపురానికి చెందిన మాచర్ల గణపతిరావుకు రూ.63,105 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే విజయచంద్ర తన కార్యాలయంలో అందించారు.
ప్రజల అభిప్రాయం లేకుండా తవ్వకాలు వద్దు
హెచ్.కారాడవలసలో క్వారీ తవ్వకాల అనుమతుల రద్దుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, ప్రజల అభిప్రాయం లేకుండా తవ్వకాలు చేయవద్దని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. తమ గ్రామం పక్కనే ఉన్న ఎలుగులమెట్టపై క్వారీ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని పార్వతీపురం మండలంలోని హెచ్.కారాడవలస గ్రామస్థులు శనివారం బోనెల విజయచంద్రకు వినతిపత్రం అందించారు. క్వారీ ఏర్పాటైతే జరగబోయే నష్టాన్ని ఎమ్మెల్యేకు వివరించారు.