Anemia రక్తహీనత నివారణకు కృషి
ABN , Publish Date - Jul 08 , 2025 | 10:49 PM
Efforts to Prevent Anemia జిల్లాలో రక్తహీనత నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైద్యసిబ్బందిని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం ఆర్‌ఆర్‌బీ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సమీక్షించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
జియ్యమ్మవలస, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్తహీనత నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైద్యసిబ్బందిని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం ఆర్‌ఆర్‌బీ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సమీక్షించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల ఆరోగ్యాన్ని తరచూ పర్యవేక్షించి.. వారికి కావల్సిన మందులు మందులు, పౌష్టికాహారం అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేసి వారికి కావల్సిన మందులు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యాధికారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.