Anemia రక్తహీనత నివారణకు కృషి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:05 AM
Efforts to Prevent Anemia జిల్లాలో రక్తహీనత నివారణకు కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఏ ఒక్కరూ ఆ సమస్యతో బాధపడకూడదన్నారు.
పార్వతీపురం రూరల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్తహీనత నివారణకు కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఏ ఒక్కరూ ఆ సమస్యతో బాధపడకూడదన్నారు. బుధవారం ఎంఆర్‌నగర్ గ్రామ సచివాలయంలో నిర్వహించిన రక్తహీనత నివారణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రతి సచివాలయ పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించాలి. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, సీహెచ్‌డబ్ల్యూ, ఎంహెచ్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి అనీమియా లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. గర్భిణులు, డెలివరీ కేసులను తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేయాలి. వారి నెలవారీ పరీక్షలు, ప్రసవం అనంతరం పిల్లలకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లు తదితర వాటిని ఏఎన్‌ఎంలు బాధ్యతాయుతంగా చేపట్టాలి. పీహెచ్‌సీల్లో నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలి. ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు విత్తనాలు అందిస్తున్నాం. ’ అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి వినోద్‌కుమార్, తహసీల్దార్ వై.జయలక్ష్మి, సీడీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- దివ్యాంగులు, 65ఏళ్లు పైబడిన వృద్ధుల ఇళ్లకే రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంఆర్‌నగర్‌లో బుధవారం రేషన్ డిపోను తనిఖీ చేశారు. అనంతరం స్వయంగా తూకం వేసి కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పొందొచ్చన్నారు.