Share News

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:20 AM

దీపం ఏ విధంగా తనను తాను కాల్చుకుంటూ వెలుగునిస్తుందో, అదే విధంగా పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.

  శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి

-ఎస్పీ మాధవరెడ్డి

- అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ

బెలగాం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): దీపం ఏ విధంగా తనను తాను కాల్చుకుంటూ వెలుగునిస్తుందో, అదే విధంగా పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పార్వతీపురంలోని కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పోలీసు అమర వీరులను స్మరిస్తూ మానవహారం నిర్వహించారు. ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసుల తమ ప్రాణాలను త్యాగం చేశారని ఎస్పీ గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐలు రమణమూర్తి, మురళీధర్‌, రంగనాథం తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం ఏఎస్పీ అంకితా బదిలీ

పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురాన మహవీర్‌ బదిలీ అయ్యారు. సత్యసాయి జిల్లా ఏఎస్పీగా (అడ్మిన్‌)ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.

Updated Date - Oct 31 , 2025 | 12:20 AM