Eradicate Poverty పేదరిక నిర్మూలనకు కృషి
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:28 PM
Efforts to Eradicate Poverty ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్, ఇతర అధికారులు అంకితభావంతో పనిచేయాలని, పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు.
పార్వతీపురం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్, ఇతర అధికారులు అంకితభావంతో పనిచేయాలని, పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీరో పావర్టీ పీ-4పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10లోగా పూర్తి చేయాలన్నారు. 15 నాటికి బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ , జేసీ శోభిక, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.