కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి: కలెక్టర్
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:59 PM
: కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం లో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
బెలగాం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం లో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుంచి కుష్ఠువ్యాధిగ్రస్థులను గుర్తించి కార్యక్రమాలు నిర్వహించాలని, కుష్ఠువ్యాధిపై విద్యార్ధులకు, ప్రజలకు అవగా హన కల్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. 15 నుంచి 26 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి అవగాహన కల్పిస్తే రాబోయే తరాల వారు వ్యాధి బారినపడకుండా ఉంటారని వివరించారు.కార్యక్రమంలో డీఎం హెచ్‌వో భాస్కరరావు, డీఈవో రాజ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ విజయగౌరి పాల్గొన్నారు.
‘హిమాచల్’ సదస్సుకు కలెక్టర్
పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): హిమాచల్‌ప్రదేశ్‌లోని మనా లిలో ఈ నెల 20, 21 తేదీల్లో జరుగనున్న జియోస్పేషియల్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలపై జరిగే ప్యానెల్ చర్చలో పాల్గొనేందుకు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభా కర్ రెడ్డికి ఆహ్వానం అందింది. భారతదేశంలో భూ పరిపాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం స్వీకరణపై హిమాచల్ ప్రభుత్వం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనుంది. ఆ సదస్సులో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొంటారు.