Share News

వీరఘట్టం పట్టణ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - May 09 , 2025 | 12:12 AM

వీరఘట్టం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌తో కలిసి ఆయన గురువారం వీరఘట్టం ప్రధాన రహదారిని పరి శీలించారు.

వీరఘట్టం పట్టణ అభివృద్ధికి కృషి
సుడా చైర్మన్‌ రవికుమార్‌తో మాట్లాడుతున్న పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ

వీరఘట్టం, మే 8 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌తో కలిసి ఆయన గురువారం వీరఘట్టం ప్రధాన రహదారిని పరి శీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరఘ ట్టం ప్రధాన రహదారి 1.7 కిలోమీటర్లలో సెంట్రల్‌ లైటిం గ్‌ కోసం, కోడిరామ్మూర్తి విగ్రహం కోసం మొత్తం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వీరఘట్టం పట్టణ అభివృద్ధిలో వెనుకబడిందని, వీలైనంత ఎక్కువ నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే సుడా చైర్మన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సుడా ఎస్‌ఈ సుగుణాకర్‌, సుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ అమర్నాథ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్కర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కృష్ణమూర్తినాయుడు, వీరఘట్టం పట్టణ అధ్యక్షుడు జామి లక్ష్మీనారాయణ, బల్లా హరిబాబు, చింతా ఉమా, మాచర్ల అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.

వెంకటరాయుని కోనేరు పరిశీలన

పాలకొండ, మే 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక నగర పంచాయతీలో ఉన్న వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. గురువారం సాయంత్రం వారు వెంకటరాయుని కోనేరును పరిశీలించారు. కోనేరును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌, సీనియర్‌ ఇంజనీర్‌ సుగుణాకర్‌కు సూచించారు. డీపీఆర్‌లను తయారు చేసి విడతల వారీగా వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పాటు కూటమి నాయకులు పల్లా కొండలరావు, కర్నేన అప్పలనాయుడు, గంటా సంతోష్‌కుమార్‌, వెన్నపు శ్రీనివాసరావు, కొరికాన గంగు నాయుడు, అంపోలు శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:12 AM