నందివానివలస రోడ్డు నిర్మాణానికి కృషి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:48 PM
నందివానివలస రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తానని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలి పారు. ఆదివారం తోటపల్లి పం చాయతీలోని పలు గ్రామాలకు రహదారి మోక్షం కల్పించాలని ఆయా గ్రామాలకు చెందిన ఎం.చిన్నంనాయుడు, ఆర్.నరసిం హనాయుడు, ఆర్.విజయ్, జి.మురళీమోహన్‌తోపాటు పలువురు జగదీశ్వరిని కలిసి వినతిపత్రం అందించారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నందివానివలస రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తానని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలి పారు. ఆదివారం తోటపల్లి పం చాయతీలోని పలు గ్రామాలకు రహదారి మోక్షం కల్పించాలని ఆయా గ్రామాలకు చెందిన ఎం.చిన్నంనాయుడు, ఆర్.నరసిం హనాయుడు, ఆర్.విజయ్, జి.మురళీమోహన్‌తోపాటు పలువురు జగదీశ్వరిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నందివానివలస ఎస్సీకాలనీ నుంచి సింగనాపురం గ్రామానికి, తోటపల్లికి రహదారిసౌకర్యం కల్పించడానికి దృష్టిసారించాలని కోరారు. ఏటావర్షాకాలం రహదారి బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించ లేపోతున్నమని తెలిపారు.ఈ మార్గంలోనే జియ్యమ్మవలస మండలంలో రైతులకు చెందిన పంటపొలాలు ఉండడంతో ఏటా వారు కూడా ఇబ్బందిపడుతున్నా రని చెప్పారు.కాగా ఈ రహదారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు.అలాగే సమస్యలు పరిష్కరిం చాలని విశ్వబ్రాహ్మణు సంఘ మండలాధ్యక్షుడు బి.శంకరరావు, గౌరవధ్యక్షులు చింతాడ తవిటాచారి, ఎ.కాశీవిశ్వేశ్వరరావుతోపాటు పలువురు కోరారు.ఈ మేరకు ఆదివారం కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతిపత్రం అందించారు.