Share News

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: అదితి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:58 PM

టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

 టీడీపీ బలోపేతానికి  కృషి చేయాలి: అదితి
టీడీపీలో చేరిన వారిని ఆహ్వానిస్తున్న అదితిగజపతిరాజు :

విజయనగరం రూరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని ఆరో డివిజన్‌ జమ్ములో వైసీపీకి చెందిన మాజీ ఉపసర్పంచ్‌ బార్నాల శ్రీను, బార్నాల శేఖర్‌, బార్నాల సంజీ వరావు, కోట్ల వెంకటరావులు అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ పార్టీ చేపడుతున్న కార్యక్ర మాల్లో భాగస్వామ్యులు కావాలన్నారు.కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్ష, కార్యద ర్శులు గంటా రవి, పీతల కోదండరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:58 PM