Share News

Tribal Development గిరిజనుల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:41 PM

Efforts for Tribal Development జిల్లాలోని గిరిజనుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం పార్వతీపురంలో ఐటీడీఏలో ఒకరోజు ముందుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తొలుత అడవితల్లి విగ్రహానికి సంప్రదాయబద్ధంగా ప్రథమ పూజ, క్షీరాభిషేకం నిర్వహించారు.

  Tribal Development  గిరిజనుల అభివృద్ధికి కృషి
గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేస్తున్న కలెక్టర్‌, ఇన్‌చార్జి పీవో

పార్వతీపురం/ బెలగాం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని గిరిజనుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం పార్వతీపురంలో ఐటీడీఏలో ఒకరోజు ముందుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తొలుత అడవితల్లి విగ్రహానికి సంప్రదాయబద్ధంగా ప్రథమ పూజ, క్షీరాభిషేకం నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ అడవితల్లి విగ్రహానికి నూతన వస్ర్తాలు, సారెను సమర్పించారు. డప్పు కొట్టి సందడి చేశారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... కల్మషం లేని అమాయక గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు జోవనోపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని జీవన విధానం మెరుగుపరుచుకోవాలని సూచించారు. గిరిజనుల సమస్యలు పరిష్కారానికి ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్‌, ఇన్‌చార్జీ పీవో విలు విద్య పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మురళీధర్‌, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆర్‌.కృష్ణవేణి, డీఐవో పి.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

పార్వతీపురం/సీతంపేట రూరల్‌,ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ దినోత్స వానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశు తోష్‌ శ్రీవాత్సవ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారు లతో మాట్లాడుతూ... శనివారం పార్వతీపురం ఐటీడీఏలో వేడుకలు ప్రారంభ మవుతాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా హాజరవుతారని, ఏర్పా ట్లలో ఎటువంటి లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు సీతం పేట గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో ఇన్‌చార్జీ పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Aug 08 , 2025 | 11:41 PM