Share News

పీఏసీఎస్‌ అభివృద్ధికి కృషి: విప్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:08 AM

కురుపాం పీఏసీఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.

 పీఏసీఎస్‌ అభివృద్ధికి కృషి: విప్‌
అన్నక్యాంటీన్‌ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న జగదీశ్వరి

కురుపాం, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): కురుపాం పీఏసీఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. సోమవారం కురుపాంలో పీఏసీఎస్‌ చైర్మన్‌గా డోల్లు కిషోర్‌, డైరెక్టర్లగా కర్రి సత్యంనాయుడు,తంగుడు సత్యనారాయణ ప్రయాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌, టైకార్‌ బోర్డు డైరెక్టర్‌ పువ్వల లావణ్య, డొంకాడ రామకృష్ణ, వెంకటనాయుడు పాల్గొన్నారు.

ఫకురుపాంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో అన్న క్యాంటీన్‌ భవనం నిర్మాణం కోసం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య, రంజిత్‌కుమార్‌, ఎంపీడీవో నాగభూషణరావు పాల్గొన్నారు.

ఫకొమరాడ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కొరిశీల గ్రామానికి చెందిన సిగురు ఉదయ్‌కిరణ్‌, కార్తీక్‌, దువ్వాన జగన్‌ కొమరాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి వారి కుటుంబాలను పరామర్శించారు. ఆమె వెంట టీడీపీ మండలాధ్యక్షుడు శేఖర్‌పాత్రుడు, హిమరిక బలరాము, రామారావు, ప్రతాప్‌ ఉన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 12:08 AM