Share News

Environmental Protection పర్యావరణ పరిరక్షణకు కృషి

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:01 AM

Efforts for Environmental Protection పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో క్లాత్‌ బాగ్‌లను ఆవిష్కరించారు.

  Environmental Protection పర్యావరణ పరిరక్షణకు కృషి
క్లాత్‌ బ్యాగ్‌లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం రూరల్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో క్లాత్‌ బాగ్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. ప్లాస్టిక్‌ భూతాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణం, జీవులకు హాని కలిగించే దాని నుంచి జిల్లాకు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించే ‘ వనం-మనం’ కార్యక్రమంలో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు. జిల్లాలో ఐదు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మండల ప్రత్యేకాధికారులు, అన్ని శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, డీఆర్వో కె.హేమలత, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌ కరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:01 AM