Voter List Mapping సమర్థవంతంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:54 PM
Effective Voter List Mapping జిల్లాలో ఓటర్ల జాబిత మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుందని డీఆర్వో కె.హేమలత తెలిపారు. శనివారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల జాబిత మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుందని డీఆర్వో కె.హేమలత తెలిపారు. శనివారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు జిల్లాలో 51.38 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. 2002 ఓటర్ల జాబితాను బీఎల్‌వో యాప్‌లోని 2025 డేటాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతమైంది. 7,88,302 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 4,05034 మందికు మ్యాపింగ్ పూర్తయింది. వారిలో పాలకొండ నియోజకవర్గంలో 1,01,927 మంది, కురుపాంలో 1,02,836 మంది, పార్వతీపురంలో 93,180 మంది, సాలూరులో 1,07,091 మంది ఉన్నారు. ఇప్పటివరకు 8,843 అన్ని రకాల క్లయిమ్‌లను స్వీకరించగా, వాటిలో 7,562 పేర్లను నమోదు చేశాం. 897 దరఖాస్తులను తిప్పి పంపించాం. 384 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.’ అని తెలిపారు.