Share News

Earthquakes in Bhogapuram భోగాపురంలో భూ ప్రకంపనలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:09 AM

Earthquakes in Bhogapuram భోగాపురంలో మంగళవారం వేకువజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 4.20 గంటల సమయంలో మంచం కదిలినట్లు, ఇంట్లో సామగ్రి కాస్త జరిగినట్లు అనిపించడంతో పాటు పెద్ద శబ్ధం రావడంతో కొందరు బయటకు వచ్చి చూశారు.

Earthquakes in Bhogapuram భోగాపురంలో భూ ప్రకంపనలు

భోగాపురంలో భూ ప్రకంపనలు

ఆందోళన చెందిన స్థానికులు

భోగాపురం, నవంబరు4(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో మంగళవారం వేకువజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 4.20 గంటల సమయంలో మంచం కదిలినట్లు, ఇంట్లో సామగ్రి కాస్త జరిగినట్లు అనిపించడంతో పాటు పెద్ద శబ్ధం రావడంతో కొందరు బయటకు వచ్చి చూశారు. ఉదయం సామాజిక మాధ్యమాల్లో విశాఖ, భీమిలి తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చిందని ప్రచారం కావడంతో అయితే ఇక్కడ కూడా భూకంపం వచ్చినట్లు స్థానికులు నిర్థారించుకొన్నారు. గంట్యాడలో కూడా భూమి కంపించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే విషయమై ఆంధ్రయూనివర్సిటీ జియో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ త్రినాథరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కేంద్రంగా ఏర్పడ్డ భూకంప తీవ్రత చాలా స్వల్పమైనదని, సెస్మిక్‌ తరంగాల ప్రకారం దీని తీవ్రత 3.7 అని, ఎవరూ భయపడనవసరం లేదని, విశాఖ (స్టేజ్‌2లో) సేఫ్‌జోన్‌లో ఉందని అన్నారు.

---------------------------

Updated Date - Nov 05 , 2025 | 12:09 AM