Check Cancer సత్వర గుర్తింపుతో క్యాన్సర్‌కు చెక్
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:16 AM
Early Detection to Check Cancer సత్వర గుర్తింపుతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. ఎన్‌సీడీ 4.0లో భాగంగా క్యాన్సర్ స్ర్కీనింగ్‌పై సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలకు గురువారం ఎన్‌జీవో హోంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సత్వర గుర్తింపుతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. ఎన్‌సీడీ 4.0లో భాగంగా క్యాన్సర్ స్ర్కీనింగ్‌పై సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలకు గురువారం ఎన్‌జీవో హోంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు నమోదు అవుతున్నాయని తెలిపారు. వాటిని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఆ తర్వాత గైనకాలజిస్ట్, డెంటల్ వైద్యులు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ పీవో జగన్మోహన్ , డీఐవో విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.